కావలసిన పదార్థాలు : శనగపిండి... 500 గ్రా బెల్లం... 600 గ్రా ఇలాచీ పొడి... 10 గ్రా నెయ్యి... 10 గ్రా మంచినూనె... సరిపడినంత.
తయారీ విధానం : శనగపిండిని సరిపడినన్ని నీళ్లతో ఒక మోస్తరు చిక్కదనం ఉండేలా కలిపి బూందీ జన్నాతో బూందీ తయారు చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, సరిపడా నీళ్లు తీసుకొని ముదురు పాకం వచ్చేవరకు సన్నని సెగపై వేడి చేయాలి. తీగపాకం వచ్చాక బూందీ, ఇలాచీ పొడి వేసి చల్లారేవరకు బాగా కలియతిప్పాలి. ఒక ట్రే తీసుకుని అడుగున నెయ్యి పూత పూసి దానిపై బూందీ మిశ్రమాన్ని వేసి చల్లార్చాలి.