ఇలా తయారు చేయండి: ముందుగా స్టౌమీద గిన్నెలోని పాలను కొవాలాగా చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కోరు, జీడిపప్పు రెండింటినీ మెత్తగా రుబ్బుకుని దానికి సరిపడేంత పంచదారను కలిపి ముద్దగా చేసుకోవాలి. అనంతరం పాకం పట్టేందుకు మిగిలిన పంచదారలో సరిపడేంత నీటిని పోసి, ఆ పాకానికి మనం ముందుగా చేసుకున్న కోవా మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి.
అలా ఆ మిశ్రమం గట్టిపడిన తర్వాత స్టౌమీద నుంచి దించి కొబ్బరి ముద్ద, కోకో పౌడర్ కలిపి అరంగుళం మందంగా వచ్చే విధంగా కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన దానిని జాగ్రత్తగా కొంత కాలం పాటు నిల్వఉంచవచ్చు.. ఎప్పుడైనా తినవచ్చు.