మిల్క్ స్వీట్

గురువారం, 8 జనవరి 2009 (18:41 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
చిక్కటి పాలు... ఒక లీటర్
యాలక్కాయలు... పదిహేను
చక్కెర... పావుకేజీ
నిమ్మకాయ... ఒకటి
నెయ్యి... నాలుగు టీస్పూన్లు

తయారీ విధానం :
ఓ గిన్నెలో పాలుపోసి వేడిచేయాలి. పాలు కాగుతుండగానే పదిచుక్కల నిమ్మరసాన్ని అందులో పిండాలి. పులుపు తగిలిన మరుక్షణం పాలు విరిగిపోతాయి. వీటిని మరికాసేపు అలాగే మరగనివ్వాలి.

తరువాత కిందికి దించి విరిగిన పాలను ఓ పల్చటి గుడ్డలో వేసి ఉంచాలి. ఒక గంట గడిచేసరికి గుడ్డలో విరిగిన పాల ముద్ద మాత్రమే మిగులుతుంది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, చక్కెర వేసి బాగా కలిపి పొయ్యిమీద పెట్టాలి.

పావుగంటసేపు అలాగే ఉడికిన తరువాత యాలక్కాయల పొడిని చల్లాలి. చివరగా ఒక పళ్ళానికి అడుగున నెయ్యి రాసి ఉడుకుతున్నపాలముద్దను వేయాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే దీనిని ఇష్టమైన రీతిలో ముక్కలుగా చేసుకునో, లేక రౌండ్‌గా బాల్స్ లాగా అయినా చేసుకుని తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి