మైదాతో గవ్వల స్వీట్

మంగళవారం, 25 మార్చి 2008 (15:41 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదా పిండి - అరకేజీ, నూనె - వేయించడానికి సరిపడ, డాల్డా లేదా నెయ్యి - పిండిని గుల్లగా కలపడానికి, చక్కెర లేదా బెల్లం (మీ అభిరుచికి తగ్గట్టు) - అరకేజీ, ఏలకుల పౌడర్ - చెంచా.

తయారు చేయు విధానం :
ముందుగా మైదాపిండిని పురుగులు లేకుండా జల్లించుకోవాలి. ఇందులో కాస్త సోడా ఉప్పును వేసి కలిపి డాల్డా, ఏలకుల పొడిని కూడా వేసి పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరోవైపు గిన్నెలో బెల్లాన్ని వేసి నీళ్లు పోసి పాకంలా చేసి ఉంచుకోవాలి. పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత గవ్వల కోసం ప్రత్యేకంగా ఉండే పీటపై ఉండలను బొటన వేలితో లాగి గవ్వలుగా చేసి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. వీటని పాకంలో వేసి బాగా తిప్పాలి. ఇవి చల్లారాక చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి