మైదాతో రసగుల్లా

సోమవారం, 20 ఆగస్టు 2007 (18:32 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి: పావు కేజీ
నెయ్యి: వందగ్రాములు
మీకు నచ్చిన రంగు: చిటెకెడు
పంచదార: అరకిలో
పాలు: ఒకకప్
యాలకుల పొడి: అర టీస్పూన్

ఇలా చేయండి:
మైదా పిండిలో నూనెను పోసి మెత్తగా కలపాలి. వేడయిన పాన్‌లో డాల్డా లేదా నెయ్యిని వేసి వేడిచేయాలి. మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో మందపాటి పూరీల్లా వత్తి వేడయిన నూనెలో బ్రౌన్‌ రంగుగా వచ్చేంతవరకు వేయించాలి. మరోవైపు పంచదారలో తగినన్ని నీటిని పోసి అందులో యాలకుల పొడి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో ముంచి తీసి ఆరనించి సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి