తీసుకోవలసిన పదార్థాలు: మైదాపిండి - 1/4 కేజీ, పాలు - ఒక కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, పంచదార - అరకిలో, కేసరి రంగు - చిటెకెడు, నెయ్యి - 100 గ్రాములు.
ఇలా తయారు చేయండి: ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని.. ఓ అరగంట పాటు ఉంచాలి. తర్వాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి లేక డాల్డాను పోయాలి. అది బాగా వేడయ్యాక అందులో ఇప్పటికే మనం కలుపుకుని ఉన్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.
ఇలా వేసిన తర్వాత మైదా పూరీలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత కూడా తినవచ్చు.