మైదా వెరైటీ గులాబ్ జామూన్

మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (11:57 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదా పిండి - రెండు కప్పులు, బియ్యపు పిండి - అరకప్పు, పెరుగు - అర కప్పు, నెయ్యి లేదా డాల్డా - పావుకప్పు, పంచదార - రెండు కప్పులు, వంటసోడా - చిటికెడు, ఏలక్కాయలు - నాలుగు, రోజ్ ఎసెన్స్ - కొన్ని చుక్కలు.

తయారు చేయు విధానం :
ముందుగా మైదాపిండి, బియ్యపు పిండి, వంటసోడా, పెరుగులను వేసి ఓ వెడల్పాటి పాత్రలో వేసి చపాతీ పిండిలాగా కలిపాలి. స్టవ్ మీద పంచదారలో నీళ్లు పోసిన పాత్రను పెట్టి పాకం కాచి దించండి. ఈ పాకంలో ఏలక్కాయ పొడి, రోజ్ ఎసెన్స్‌లను వేసి కలపాలి.

తర్వాత స్టవ్ మీద పెద్ద బాణాలి పెట్టి అందులో నెయ్యి లేదా డాల్డాలను వేసి కాచండి. మరో వైపు కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి కాగిన నేతిలో వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించి తీయండి. వీటిని పంచదార పాకంలో వేయాలి. కనీసం ఐదు గంటల సేపైనా వీటిని నాననివ్వాలి. తర్వాత సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి