ముందుగా జీడిపప్పును కొద్ది నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నేతిలో రవ్వను వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే రోటిలో దంచాలి. పంచదారలో కొద్దిగా నీటిని పోసి తీగపాకం పట్టి, ఆ పాకంలో అన్నీ కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరగిపోయేలా ఉంటుంది. ఆవకాయలాగా ఆంధ్రులకు రవ్వలడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదుగదా మరి..