కావలసిన పదార్థాలు: మైదాపిండి: రెండు కప్పులు గ్రుడ్లు: నాలుగు బేకింగ్ పౌడర్: రెండు టేబుల్ స్పూన్లు వాల్ నెట్: ఒక కప్పు బెల్లం: అరకప్పు నీరు: అర కప్పు వెనిల్లా ఎసెన్స్: అర స్పూన్
తయారీ విధానం: బెల్లాన్ని నీటిలో కరిగించి ఐదు నిమిషాలు స్టౌ మీద ఉంచి మరిగించండి. తర్వాత వడగట్టి ఆరనించండి. మైదాతో పాటు బేకింగ్ పౌడర్‌ను కలిపి రెండు సార్లు గిలకొట్టండి. వెన్న, గ్రుడ్లను కూడా అందులో చేర్చుకుని నురుగు వచ్చేంతవరకు బాగా గిలకొట్టి అందులో బెల్లపు నీటిని కలపండి. తర్వాత మైదాపిండిని కలిపి ఉండలు కట్టనీయకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత వెన్నను రాసిన టిన్నులపై ఈ మిశ్రమాన్ని పోసి 30 నిమిషాలు బేక్ చేయండి. బేక్ అయిన తర్వాత జీడీపప్పు వంటి నెట్‌లతో అందంగా అలంకరించి సర్వ్ చేయండి.