వెరైటీ బాదుషా

మంగళవారం, 18 మార్చి 2008 (12:09 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బియ్యపు పిండి - కప్పు, వెన్న - అర కప్పు, పంచదార - రెండున్నర కప్పులు, నూనె - పావు కిలో, డెకరేషన్‌ కోసం - చెర్రీ పళ్లు.

తయారు చేయు విధానం :
ముందుగా పంచదారను మిక్సీలో పొడిగా చేసుకోవాలి. వెన్నలో బియ్యపు పిండిని కలిపి గట్టిగా చేసుకోవాలి. దీనిని కావలసిన ఆకారంలో చేసుకుని కాగిన నూనెలో వేయించి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వీటిని పంచదార పొడిలో వేసి బాగా తిప్పాలి. తర్వాత దీని మధ్యలో చెర్రీ పళ్లను గుచ్చి అలంకరించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి