శ్రీఖండ్

శనివారం, 30 ఆగస్టు 2008 (19:22 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పెరుగు... అరకేజీ
పంచదార... 300 గ్రాములు
క్రీము... 50 గ్రాములు
తరిగిన బాదం... ఆరు గ్రాములు
కుంకుమపువ్వు... రెండు గ్రాములు
యాలకుల పొడి... రెండు గ్రాములు

తయారీ విధానం :
పంచదార, పెరుగు ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార కరిగి అందంగా మెత్తగా అయ్యేంతదాకా మెల్లగా గిలకొట్టాలి. తరువాత ఒక గాజు పాత్రలోకి తీసుకుని క్రీము కలిపి, బాదం, కుంకుమ పువ్వులతో అంలకరించి, ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి