సేమియాతో హల్వా

శుక్రవారం, 24 ఆగస్టు 2007 (18:57 IST)
కావలసిన పదార్థాలు :
జీడిపప్పు ముక్కలు : 10 గ్రాములు
యాలకులు : 4
నెయ్యి : 2 టేబుల్‌ స్పూన్లు
సేమియా : 50 గ్రాములు
పాలు : అరలీటరు

ఇలా చేయండి :
బాణలి వేడయ్యాక నెయ్యిని వేసి జీడిపప్పును దోరగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో సేమియాను కూడా దోరగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత సేమియాను గ్లాసుతో కొలిచి గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు పాలు ఎసరుపెట్టాలి. మరిగిన తర్వాత వేయించిన సేమియాను వేసి ఉడికించాలి. తర్వాత గ్లాసుకు ముప్పావు పంచదారను వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు, యాలకుల పొడిని వేసి ఒక పళ్ళానికి నెయ్యిని రాసి అందులో సర్దాలి. అరగంట అయిన తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి