కావలసిన పదార్ధాలు: చిన్న సొరకాయ... ఒకటి పాలు... ఒక లీటర్ జీడిపప్పు... 20గ్రాములు యాలకులు... పది కిస్మిస్... కొద్దిగా పంచదార...300 గ్రాములు
తయారీ విధానం: సొరకాయ చెక్కుతీసి ముక్కలుగా చేసి కొబ్బరికోరినట్లుగా సన్నగా కోరుకోవాలి. ఈ కోరును ముద్దగా చేసి నీళ్ళన్నింటినీ పిండి పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి వేడయ్యాక నెయ్యి పోసి, కాగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి.
తరువాత అదే గిన్నెలో, మిగిలిన నెయ్యిలో కోరిన సొరకాయను వేసి 10 నిమిషాలు వేయించాలి. ఆపై అందులోనే పాలు, పంచదార వేయాలి. అది బాగా దగ్గర పడి హల్వాలా అయ్యేదాకా గరిటతో కలుపుతూ ఉండాలి. తరువాత హల్వాను దించుకునేముందు వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి కలపాలి. అంతే సొరకాయ హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.