కావలసిన పదార్థాలు : ప్లెయిన్ కేక్... ఒకటి స్ట్రాబెర్రీలు... గుప్పెడు నిలువుగా కోసినవి వెనీలా ఐస్‌క్రీమ్... 500 గ్రాములు జిలిటెన్... రెండు టీస్పూన్లు (గోరువెచ్చటి నీటిలో కలిపి ఉంచాలి) పాలు... చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి)
తయారీ విధానం : ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసినంత సైజులో స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలు, జిలిటెన్, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. సర్వింగ్ డిష్ తీసుకుని అందులో కేక్ ముక్కలను వేసి, పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి, స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించి సర్వ్ చేయాలి.