స్వీట్ టమోటా

మంగళవారం, 11 మార్చి 2008 (12:46 IST)
కావలసిన పదార్థాలు :
ఆపిల్ టమోటాలు - ఐదు, పంచదార - అర కప్పు, పట్టా - చిన్న ముక్క, జీడిపప్పు - ఎనిమిది, ఏలక్కాయలు - మూడు, సీడ్‌లెస్ ద్రాక్ష - 14, ఆపిల్ - సగం ముక్క.

తయారు చేయు విధానం :
ముందుగా టమోటాలను వేడినీటిలో వేసి తోలి తీసి పిసికి పక్కన పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి పట్టా, ఏలక్కాయలను వేసి తాలింపు పెట్టాలి. అర కప్పు నీరు పోసి ఉడికించాలి. టమోటాల్లో పచ్చి వాసన పోయేంత వరకూ పంచదార వేస్తూ ఉండాలి. చక్కెర కరిగి కాస్త గట్టిపడేంత వరకు ఉంచి దించాలి. నెయ్యిలో జీడిపప్పు, ఏలక్కాయలు, తరిగిన ఆపిల్ ముక్కలు, ద్రాక్షలను వేయించి టమోటా మిశ్రమంలో వేయాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత దించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి