అరటి పండు కేక్

ఏ సీజన్‌లోనైనా అందుబాటులో ఉండే అరటి పండు ధర కూడా తక్కువే. ఈ అరటి పండుతో చేసే కేక్ ఎంతో రుచికరంగా ఉండగలదు.

కావాల్సిన వస్తువులుః
మైదా పిండి - 300 గ్రాములు
పంచదార- 300గ్రాములు
వెన్న -250 గ్రాములు
అరటి పండ్లు-4
ఎండు ద్రాక్ష-125 గ్రాములు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
వంట సోడా - అర టీస్పూన్
కోడిగుడ్లు -5
అరటిపండు ఎసెన్స్ - 1 టీస్పూన్
వెన్నిలా ఎసెన్స్- పావు టీ స్పూన్
సోడియం బై కార్బొనేట్ - 1టీస్పూన్

తయారీ విధానం
మైదా పిండితో బేకింగ్ పౌడర్, ఆపం సోడాలను కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో అరటి పండును, సోడియం బైకార్బొనేట్‌ను కలిపి పెట్టుకోవాలి. వెన్న, పంచదార కలిపి, పొడి చేయాలి. కోడి గుడ్డు కొట్టి, సొనను వెన్నతో కలుపుకోవాలి.

కోడి గుడ్డు మిశ్రమం, వెన్న మిశ్రమం, మైదా, అరటి పండు మిశ్రమం, ద్రాక్ష, జీడిపప్పు, ఎసెన్సులను కలిపి గంటపాటు తేలికపాటి మంటల్లో వేయించాలి. ఇక రుచికరమైన అరటి పండు కేక్ మీ కోసం రెడీ.

వెబ్దునియా పై చదవండి