కావలసిన పదార్థాలు : మంచి అరటి పండు - ఒకటి, పంచదార - 100గ్రాములు, వెన్న - 50 గ్రాములు, ఉప్పు - చిటికెడు, మైదా పిండి - 200 గ్రాములు, కార్న్‌ఫ్లోర్ - 50 గ్రాములు, కోడి గుడ్డు - ఒకటి, అరటి ఎసెన్స్ - కొన్ని చుక్కలు, జీడి పప్పు - 20 గ్రాములు, బేకింగ్ సోడా - పావు స్పూన్.
తయారు చేసే విధానం : ముందుగా జీడి పప్పు, పంచదారలను పొడి లాగా కొట్టుకోవాలి. కోడి గుడ్డును పగులగొట్టి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిలో బేకింగ్ సోడాను వేసి బాగా కలపి దీనిలో ఉప్పు కూడా వేసి కలపాలి. తర్వాత వెన్నలో పంచదార పొడిని వేశాక కోడి గుడ్డు సొన, ఎసెన్స్ వేసి కలపాలి. ఆ తర్వాత మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అరటి పండు, జీడి పప్పు పొడిలను వేసి బాగా కలపాలి.
స్పూన్‌తో తీస్తే వచ్చే విధంగా గుల్లగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రేలో నెయ్యి రాసి మిశ్రమాన్ని స్పూన్‌తో తీసి కావలసిన ఆకృతిలో పరచాలి. దీనిని ఓవెన్‌లో పెట్టి 300 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో ఉంచి 20 నిముషాల పాటు ఉడికించాలి. అంతే అరటి బిస్కట్ రెడీ. అరటి పండు ఇష్టపడని వారు దీనిని ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినడంతో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి.