కావలసిన వస్తువులు : పెసరపప్పు : 110 గ్రాములు బెల్లం : 175 గ్రాములు ఏలక్కాయలు : ఎనిమిది జీడిపప్పు : 35 గ్రాములు కొబ్బరి పాలు : 1/4 లీటరు
ఇలా చెయ్యండి : మొదట పప్పును బాగా కడగండి. అర లీటరు నీళ్లు మరగపెట్టి అందులో పప్పు వెయ్యాలి. పప్పు ఉడికాక బెల్లం కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, కొబ్బరిపాలను కలుపుకోవచ్చు. కొబ్బరిపాలు కలిపాక కొంచెం సేపు పొయ్యిమీద ఉంచి, దింపిన తరువాత, వేయించిన జీడిపప్పు, ఏలక్కాయల పొడి కలిపి సేవించవచ్చు. కొబ్బరి పాలకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చు.