కావలసిన పదార్థాలు : కొబ్బరికాయలు... రెండు చల్లార్చిన పాలు... 3 కప్పులు కోకోనట్ ఎసెన్స్... 2 చెంచాలు పంచదార... 3 కప్పులు మిఠాయిరంగు పొడి... 1 చెంచా స్కిమ్ మిల్క్ పౌడర్... 1 కప్పు
తయారీ విధానం : కొబ్బరి తురిమి దాంట్లో పాలు, పాలపొడి వేసి బాగా చిక్కబడేంత వరకూ ఉడికించాలి. వీటిలోని నీరు ఆవిరయ్యేదాకా అడుగంట కుండా చూస్తూ కలుపుతూ ఉండాలి. తరువాత దాంట్లో పంచదార పోసి బాగా కలపాలి. పంచదార వల్ల మిశ్రమం మళ్ళీ జారుగా అవుతుంది. దీన్ని మళ్ళీ గట్టిపడేంతదాకా ఉడికించి ఎసెన్స్ కలిపి... నెయ్యి రాసిన పళ్ళంలో ఈ మిశ్రమాన్ని పోసి సమంగా పరచి, ఆరిపోయి గట్టిపడిన తరువాత కావాల్సిన రీతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే కోకోనట్ చాక్లెట్ రెడీ అయినట్లే...!