కావలసిన వస్తువులు : పాలు... 5 లీటర్లు చక్కెర... 600 గ్రాములు కేసరి (కుంకుమపువ్వు)... 3 గ్రాములు బాదంపప్పు... 100 గ్రాములు
తయారీ విధానం : పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి.. చిక్కబడుతుండగా చక్కెర వేసి కాసేపటి తరువాత... ఒక ట్రేలో పోయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవాను సిద్ధం చేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత దానిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం కోవాలో కుంకుమపువ్వు వేసి, కొంచెం వేడిపాలు పోయాలి. దానిని అలాగే పది నిముషాలసేపు నాననివ్వాలి.
మిగిలిన కోవాలో కొద్ది కొద్దిగా తీసుకుని, రోల్స్‌లాగా చేసి ఒక్కో రోల్ మధ్యలో కుంకుమపువ్వు వేసిన కోవాను పెట్టి మళ్ళీ గుండ్రంగా చుట్టాలి. అలా మొత్తం చేసుకున్న తరువాత ఒక్కోదానిపైన, ఒక్కో బాదంపప్పును అతికించాలి. అంతే కోవా కేసర్ ఖైన్ రెడీ అయినట్లే...! మీరూ ప్రయత్నిస్తారు కదూ...!