క్యారెట్ తురుముతో పాయసం

శనివారం, 11 ఆగస్టు 2007 (14:49 IST)
కావలసిన పదార్థాలు :
బాదంపప్పు, జీడిపప్పు : 10 గ్రాములు
యాలకుల పొడి : 1 స్పూన్
క్యారెట్ : 1/4 కిలో
కస్టర్డ్ పౌడర్ : 2 స్పూన్లు
పంచదార : 1/4 కిలో
పాలు : 1 లీటర్
మీగడ : 1/2 కప్పు
నెయ్యి : 2 స్పూన్లు

ఇలా చేయండి :
వేడైన బాణలిలో రెండు స్పూన్ల నెయ్యిని వేసి క్యారెట్ తురుమును వేయించి, ఈ తురుములో పాలు పోసి 5 నిమిషాల పాటు కుక్కర్‌లో ఉడికించండి. తరువాత దాన్ని తీసి బాణలిలో పోసి మీగడ, పంచదార వేసి కస్టర్డ్ నీటిలో కలిపి పాయసంలో వేసి సన్నని సెగలో ఒకసారి వేడి చేసి దింపాలి. ఇప్పుడు నానబెట్టిన బాదం, జీడిపప్పులను సన్నగా పొడవుగా ముక్కలు చేసి యాలకుల పొడితోపాటు పాయసంలో కలిపి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయండి.

గమనిక: పంచదార వేసిన తరువాత ఎక్కువసేపు స్టౌపై ఉంచితే పాయసం విరిగిపోతుంది.

వెబ్దునియా పై చదవండి