గుమ్మడి స్వీట్

మంగళవారం, 1 ఏప్రియల్ 2008 (14:03 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పసుపు రంగులో ఉండే గుమ్మడి పండు ముక్కలు - 300గ్రాములు, శెనగపిండి - కప్పు, బెల్లం లేదా పంచదార - కప్పు, వెనీలా ఎసెన్స్ - చిటికెడు, జీడిపప్పు - పది పప్పులు.

తయారు చేయు విధానం :
ముందుగా గుమ్మడి తొక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బెల్లం లేదా పంచదారను ఓ గిన్నెలో వేసుకుని తగినన్ని నీరు పోసి స్టవ్‌ మీద పెట్టి పాకంలా చేసుకోవాలి. తర్వాత ఇందులో గుమ్మడి ముక్కలు వేసి ఉడికించాలి. ఇవి కాస్త కలిశాక ఇందులో శెనగపిండి వేసి కలపాలి.

గిన్నెకి అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. కాస్త గట్టిపడ్డాక ఇందులో నెయ్యి లేదా వెన్న వేసి కలపాలి. ఉండలా తయారయ్యాక వెన్న రాసిన ఓ పాత్రలో దీనిని వేసి పరవాలి. నేతిలో వేయించిన జీడిపప్పును అలంకరించాలి. లేదంటే గుమ్మడి మిశ్రమం ఆరాక దానిపై అలంకరించాలి. మీకు ఇష్టముంటే కాస్త వేడిగా ఉన్నప్పుడే దానిని ఉండలుగా చేసి పైన జీడిపప్పును అలంకరించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి