గుమ్మడికాయ హల్వా

మిఠాయి దుకాణాల్లో లభించే హల్వాకన్నా ఇంటిలోనే చేసే గుమ్మడికాయ హల్వా చేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఆ రుచిని ఆస్వాదించాలనుకుంటే మీరు కూడా దానిని తయారు చేసుకోవాల్సిందే.

కావాల్సిన పదార్థాలుః
గుమ్మడికాయ-పావు కేజీ
పంచదార -అరకేజీ
పాలు - 50 మిలీ
నెయ్యి - వంద గ్రాములు
జీడిపప్పు- 50 గ్రాములు
ఏలకులు, పచ్చకర్పూరం
తయారీ విధానం
గుమ్మడికాయను తోలు తీసి, తురుములా చేసి పెట్టుకోవాలి జీడి పప్పును పగుల గొట్టి నెయ్యితో వేయించాలి. ఓ చిన్న బాణలిలో పాలు పోసి, స్టవ్ మీదుంచండి.

పాలు బాగా కాగే సమయంలో గుమ్మడికాయ తురుమును అందులో వేసి మూత పెట్టాలి. సగం ఉడికిన తర్వాత కొద్దిగా కలబెట్టండి.

గుమ్మడి ఉడగబెట్టినట్టు పొంగు వచ్చే సమయంలో అందులో తగినంత పంచదార వేసి, కలబెట్టాలి. పంచదార వేసిన వెంటనే గడ్డ కట్టిపోవచ్చు.

దీనికోసం నెయ్యిని కొద్దికొద్దిగా అందులో వేయాలి. దాంతో పాటు వేయించిన జీడిపప్పు, పచ్చ కర్పూరం పొడి కూడా చల్లిన తర్వాత ఆరబెట్టండి. రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ. ఇక వడ్డించి, ప్రశంసలు అందుకోవడమే తరువాయి.

వెబ్దునియా పై చదవండి