గులాబ్ జామూన్

గురువారం, 21 ఆగస్టు 2008 (15:46 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
చిక్కటి పాలు... ఒక లీటర్
నెయ్యి... పావుకేజీ
తినే సోడా ఒక టీస్పూన్
చక్కెర... ఒక కేజీ
మైదా... అరకేజీ

తయారీ విధానం :
పాలను ఒక గిన్నెలో పోసి పొయ్యిమీద పెట్టి, బాగా మరిగేంతదాకా తిప్పుతూ కాగబెట్టాలి. లీటరు పాలు 600 మిల్లీ లీటర్లు అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతుంటే పాలు కోవాలాగా మారుతాయి. దీంట్లో మైదాపిండిని జల్లించి, సోడా వేసి బాగా కలపాలి.

పై మిశ్రమాన్ని ఎక్కడా గడ్డలు కట్టకుండా బాగా మెత్తగా కలపాలి. తరువాత ఒక గిన్నెలో చక్కెర, తగినన్ని నీళ్ళు పోసి స్టవ్‌పై వేడి చేయాలి. ఇది కొద్దిగా పాకం లాగా తయారయ్యేదాకా ఉంచి వెంటనే కిందకు దించేయాలి.

ఇప్పుడు పైన కలిపి ఉంచుకున్న కోవా, మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో ఎర్రగా వేయించి తీసి చక్కెర పాకంలో వేయాలి. బాగా వేడి చల్లారిన తరువాత జామూన్‌లను ఫ్రిజ్‌లో ఉంచుకుని చల్లచల్లగా తినవచ్చు. వీటిని ఒకరోజుపాటు అలాగే అట్టిపెడితే బాగా మెత్తగా తయారవుతాయి. మంచి రుచిగా కూడా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి