జీడిపప్పు పాకం

శనివారం, 16 ఆగస్టు 2008 (16:26 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పు... పావుకిలో
పంచదార... పావుకిలో
నెయ్యి... 2 చెంచాలు
తినే సోడా... చిటికెడు

తయారీ విధానం :
తాజా జీడిపప్పు పావుకిలో తీసుకొని శుభ్రపరచుకొని ఒక టీస్పూను నెయ్యివేసి కమ్మని వాసన వచ్చేదాక వేయించాలి. పావుకిలో పంచదార తీసుకొని ఒక చిన్న గ్లాసుడు నీళ్ళుపోసి పొయ్యిమీద సన్నని సెగమీద ఉండపాకం వచ్చేదాకా తిప్పాలి.

తరువాత అందులో ఒక టీస్పూను నెయ్యి, చిటికెడు తినే సోడా వేసి బాగా కలిపి, వేయించిన జీడిపప్పును కూడా పోసి... బాగా కలపాలి. ఒక పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసి, జీడిపప్పు పాకాన్ని పళ్ళెంలో పోసి ఆరకుండా ముక్కలుగా కోసుకోవాలి. బాగా చల్లారిన తరువాత వాటిని డబ్బాలో భద్రపరచుకోవాలి.

వెబ్దునియా పై చదవండి