తయారీ విధానం : ముందుగా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పును కలిపి నేతిలో వేయించుకోవాలి. బాదంపప్పును వేడి నీటిలో నానపెట్టాలి. ఓ గంట తరువాత బాదంపప్పు మీద తొక్కతీసి, మెత్తగా రుబ్బుకోవాలి. నూరిన బాదంపప్పు ముద్దకి 3/4 లీటరు నీళ్ళు కలిపి, మరగపెట్టాలి.
అంటే పచ్చివాసన పోయేంత వరకు మరగనిచ్చి, అందులో చక్కెర, వేయించి ఉంచిన జీడి, పిస్తా పప్పులు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వులను వేసి కలపాలి. అంతే బాదంపప్పు పాయసం రెడీ... ఈ పాయసాన్ని ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి అనంతరం సర్వ్ చేయొచ్చు. కూలింగ్ వద్దనుకునే వారికి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.