జీడిపప్పు హల్వా తయారీ విధానం

మంగళవారం, 25 డిశెంబరు 2007 (15:39 IST)
తీసుకోవలసిన పదార్ధాలు: జీడిపప్పు - 150 గ్రాములు, యాలకలు - 5, పాలు - ఒక లీటరు, పంచదార - 200 గ్రా, మిఠాయి కలర్ - చిటికెడు.

ఇలా తయారు చేయండి: ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.

స్టౌమీద పాలలో ఉడికే జీడిపప్పుకు పంచదారను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గట్టిపడేదాకా స్టౌమీద ఉడికించాలి. అలా గట్టిగా ముద్దగా తయారైన తర్వాత మిఠాయి కలర్‌ను, ఏలకుల పొడిని వేసి బాగా కలుపుకుని దించేసుకుంటే జీడిపప్పు హల్వా రెఢీ..

వెబ్దునియా పై చదవండి