తీపి సేమ్యా

బుధవారం, 20 ఆగస్టు 2008 (18:41 IST)
FileND
కావలసిన పదార్థాలు :
చక్కెర... 200 గ్రాములు
కొబ్బరి... సగం (కోరినది)
జీడిపప్పు... 20 గ్రాములు
నెయ్యి... 50 లేదా 75 గ్రాములు
కేసరిపొడి... తగినంత
పచ్చకర్పూరం... తగినంత
ఏలక్కాయలు... 6 పలుకులు

తయారీ విధానం :
నాలుగు టీ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పు వేయించుకోవాలి. కొబ్బరి కోరును కూడా కలుపుకోవాలి. ఒక గరిటెడు నీరు చక్కెరకి కలుపుకుని పంచదార పాకం చేసుకోవాలి. ఆ పాకం చిక్కబడకముందే పైన వేయించినవన్నీ, కేసరిపొడి కలపాలి. ఒక్కొక్కప్పుడు పాకం చిక్కబడితే , సేమ్యా నెయ్యి కలిపి, నాలుగు ఐదుసార్లు బాగా కలపాలి. పొయ్యిమీద నుంచి దించి పచ్చకర్పూరం, ఏలక్కాయలపొడి లాంటివి కలిపి వడ్డించాలి.

వెబ్దునియా పై చదవండి