నువ్వులతో పూర్ణం

బుధవారం, 27 ఆగస్టు 2008 (19:29 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
నువ్వులు... 80 గ్రాములు
బెల్లం లేదా చక్కెర... సరిపడా
ఏలక్కాయలు... సరిపడా

తయారీ విధానం :
నువ్వులు కడిగి ఒక గంటసేపు నానబెట్టాలి. చాలాసార్లు కడిగి వడబోసి ఆరబెట్టాలి. శుభ్రంగా, గరుకుగా ఉండేచోట ఈ నువ్వులు పోసి చేత్తో రుద్దితే పైపొట్టు వచ్చేస్తుంది. పై తొక్కు తీసి, ఎర్రగా వేయిస్తే నువ్వులు తెల్లగా వస్తాయి.

తరువాత రోలును శుభ్రం చేసుకుని, తడిలేకుండా చూసి, నువ్వులను పొడి చేసుకుని దానికి సరిపడా బెల్లం లేదా చక్కెరను దానికి కలిపి ఏలక్కాయలను పొట్టుతీసి, దంచుకుని నువ్వుల మిశ్రమంలో కలపాలి. తరువాత మెత్తగా దంచి పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి