నేతి బిస్కెట్లు

బిస్కెట్ అంటే కేవలం దుకాణాలలో తీసుకుని తినే బిస్కెట్లుగా కాక పిల్లల కోసం ఇళ్లలో తినే విధంగా మనమే తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సులభంగా చేయగలిగిన దీనిని పిల్లలకు, బంధువర్గాలకు వీటిని తయారు చేసి పెట్టొచ్చు.

కావాల్సినవిః
మైదా పిండి- 200గ్రాములు
బేకింగ్ పౌడర్ - 1టీస్పూన్,
పంచదార పొడి- అర కప్పు
నెయ్యి - 12 కప్పులు

తయారు విధానం: మైదా పిండిలను బాగా కలిపి, జల్లెడ పట్టించాలి. అందులో చక్కెర పొడిని కూడా చేర్చి కలబెట్టాలి. ఇందులో పంచదార పొడి కూడా కలిపి గట్టిగా పాకం పట్టాలి.

ఈ పిండిని పూరికి చేస్తున్న తరహాలో చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. నెయ్యి కలిపిన పళ్లెంలో పరచాలి. ఓవన్‌లో 15 నిమిషాలు పెట్టి తీసిన తర్వాత వేడిగా ఉన్న సమయంలోనే బిస్కెట్‌పై నెయ్యి తడపండి.

ఆరోగ్యకరమైన నేతి బిస్కెట్ రెడీ!

వెబ్దునియా పై చదవండి