బియ్యపు పిండిలో పాలు, కొద్దిగా బెల్లం తురుము వేసి ముద్దలా కలిపి చిన్న గోళీలంత ఉండలు చేసుకోవాలి. బెల్లంతురుములో తగినన్ని నీళ్ళు పోసి తీగపాకం రానిచ్చి అందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి ఉంచాలి. స్టవ్ మీద నీళ్ళు పెట్టి బాగా మరిగించి బియ్యపు ఉండలు, కొబ్బరి తురుము వేసి మూడు వంతులు ఉడికించి మెదిపిన పెసరపప్పు కూడా వేయాలి. తరువాత బెల్లం పాకం పోసినేతిలో జీడిపప్పు దోరగా వేయించి కలపాలి. బియ్యపుపిండి గుజ్జు కూడా పోసి 5 నిమిషాలు ఉడికించి గిన్నెదించుకోవాలి.