కావలసిన పదార్థాలు : చాయపెసర పప్పు... ఒక కేజీ పంచదార... ఒకటింపావు కిలో నెయ్యి... 400 గ్రాములు జీడి పప్పు... 50 గ్రాములు యాలకుల పొడి... సరిపడా పచ్చ కర్పూరం... చిటికెడు లెమన్ ఫుడ్ కలర్... అర టీస్పూను నీళ్లు... సరిపడా
తయారీ విధానం : ముందుగా పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి అందులో పంచదార వేసి సరిపడా నీళ్లుపోసి ఫుడ్ కలర్, పచ్చకర్పూరం, యాలకుల పొడిని కలపి తీగ పాకం వచ్చే వరకూ కలియబెట్టాలి.
ఆ తరువాత పెసరపొడి, కొంచెం కొంచెంగా నేయిని జతచేస్తూ బాగా కలిపి దించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఓ మోస్తరు సైజులో ముద్దలుగా తీసుకుని ఒక్కో ముద్దపైన ఒక్కొక్క జీడి పప్పు పెట్టి లడ్డూలుగా చేసుకోవాలి. అంతే రుచికరమైన పెసరలడ్డూలు రెడీ.