కావలసిన పదార్థాలు : పెసరపప్పు... ఒక కప్పు బెల్లం... ఒక కప్పు పాలు... అర లీటరు ఏలకులు... నాలుగు కిస్మిస్... ఒక టీస్పూన్ జీడిపప్పు... రెండు టీస్పూన్లు నెయ్యి... నాలుగు టీస్పూన్లు
తయారీ విధానం : పెసరపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లను నెయ్యిలో వేయించాలి. పాలు కాగబెట్టి వేయించిన పెసరపప్పును అందులో కలపాలి. పెసరపప్పు ఉడికిన తరువాత బెల్లం తరుగు వేసి బాగా కలపాలి. పాయసం చిక్కబడిన తరువాత వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడిని కలిపి దించేయాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.