కావలసిన పదార్థాలు : కిస్‌మిస్: తగినన్ని యాలకులు: 5 కాయలు నెయ్యి: 100 గ్రాములు బంగాళాదుంపలు: పావుకిలో పంచదార: అర్థపావుకిలో జీడిపప్పు: 10 పలుకులు
తయారీ విధానం : ఒక గిన్నెలో అర్థపావు కిలో పంచదార పోసి చాలా కొద్దిగా నీరు పోసి పొయ్యిమీద పెట్టి పంచదార కరిగేదాకా బాగా కలపండి. కొద్దిగా తీగపాకం వచ్చినప్పుడు అందులో ఉడికించి మెత్తగా పొడిగా చేసిన బంగాళాదుంప ముక్కల్ని కలుపుకుని, నెయ్యి పోస్తూ త్రిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక చెంచా నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించుకొని హల్వాలో కలుపుకోండి. పొటాటో హల్వా రెడీ...