బటర్ బాసంతి

మంగళవారం, 4 మార్చి 2008 (11:08 IST)
కావలసిన పదార్థాలు :
ఉప్పుడు బియ్యం - 50 గ్రాములు, పాలు - అరలీటరు, జీడిపప్పు - 200 గ్రాములు, కొబ్బరి - పావు చిప్ప, పంచదార - 300 గ్రాములు, వెన్న - 50 గ్రాములు, నెయ్యి - 50 గ్రాములు, పసుపు - చిటికెడు, ఇంగువ - పావు స్పూన్.

తయారు చేయు విధానం :
ముందుగా వేడి నీళ్లలో జీడి పప్పును నానబెట్టుకోవాలి. ముందుగానే బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. గంట తర్వాత బియ్యాన్ని, జీడిపప్పును విడి విడిగా నూరుకోవాలి. పాలను బాగా కాచి పావు లీటరుకు తగ్గే వరకు కాచి ఉంచాలి. కొబ్బరిని తురిమి మెత్తగా నూరి చిక్కని పాలు తీసుకోవాలి.

ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, బియ్యపు పేస్టును కాగిన పాలలో వేసి కొబ్బరి పాలు, పంచదారలను కూడా వేసి బాగా కలపాలి. పసుపులో కాస్త ఇంగువ కూడా వేసి కలిపి కాస్త తీసి బియ్యపు మిశ్రమంలో వేయాలి. చివరగా ఇందులో వెన్న, నెయ్యి, పంచదారలను వేసి బాగా కలపాలి. దీనిని ఓ పాత్రలో సగం వరకు పోసి కుక్కర్‌లో 30 నిముషాల పాటు ఆవిరిలో ఉంచి తీసి సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి