బెల్లంతో నువ్వుల ఉండలు

సోమవారం, 12 జనవరి 2009 (17:19 IST)
కావలసిన పదార్థాలు :
నువ్వులు... పావుకేజీ
బెల్లం... ముప్పావుకేజీ
డాల్డా లేదా నెయ్యి... వంద గ్రాములు
బియ్యంపిండి... 150 గ్రాములు
మైదా... 50 గ్రాములు

తయారీ విధానం :
మొదట నువ్వు పప్పులను శుభ్రపరచి వేయించి ఉంచుకోవాలి. బెల్లం సన్నగా తరిగి గిన్నెలో వేసి, కాస్తంత నీరు పోసి, స్టవ్‌మీద పెట్టాలి. తీగపాకం వచ్చాక, అందులో మైదాపిండి, నువ్వు పప్పులు, బియ్యంపిండి పోసి... ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

కాస్త ఆరిన తరువాత చిన్న, చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి లేదా డాల్డా పోసి కాగిన తరువాత నువ్వు ఉండలను అందులో వేసి ఎర్రగా వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. అంతే బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు తయారైనట్లే..! వీటిని చల్లారిన తరువాత బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి