కావలసిన పదార్థాలు : బ్రెడ్ ముక్కలు... పది పంచదార... అరకేజీ నెయ్యి లేదా నూనె... తగినంత వేడి చేసిన పాలు... అరలీటరు పచ్చిపాలు... పావు లీటరు వేయించిన జీడిపప్పులు... పది గ్రాములు వేయించిన బాదంపప్పులు... పది గ్రాములు యాలక్కాయల పొడి... 5 గ్రాములు
తయారీ విధానం : ముందుగా బ్రెడ్ ముక్కలని నేతిలోగానీ లేదా నూనెలోగానీ బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలోకి ఒక కప్పు నీరు, అరకేజీ పంచదార వేసి పాకం వచ్చేదాకా ఉడికించాలి. తరువాత అందులో బ్రెడ్ ముక్కలు, కాచిన పాలు పోయాలి.
కాసేపు ఉడికిన తరువాత పచ్చి పాలు పోయాలి. పాలు చిక్కబడ్డాక... వేయించిన జీడి పప్పులు, బాదం పప్పులు, యాలకుల పొడి వేయాలి. అంతే బ్రెడ్‌తో తయారైన డబుల్ కా మీటా తయారైనట్లే... దీన్ని వేడిగానైనా, లేదా ఫ్రిజ్‌లో ఉంచి తీసి చల్లగానైనా తినవచ్చు.