కావలసిన పదార్థాలు : బ్రెడ్ ప్యాకెట్... ఒకటి పంచదార... ఒక గ్లాసు నెయ్యి.. 50 గ్రాములు యాలకుల పొడి... చిటికెడు జీడిపప్పు పొడి... రెండు చెంచాలు
తయారీ విధానం : ముందుగా బ్రెడ్‌కు చుట్టూగల భాగాన్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి కాసేపు కాగిన తర్వాత, బ్రెడ్ ముక్కలు వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచుకోవాలి.
మరో పాత్ర తీసుకుని అందులో పంచదార పోసి కొంచెం నీరు జతచేసి ఉడికించాలి. పంచదార కరిగి మరుగుతూ లేతపాకం వచ్చాక వేగిన బ్రెడ్ ముక్కలు, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, మరికాస్త నెయ్యి వేసి బాగా కలిపి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ అయినట్లే...!
ఈ బ్రెడ్ హల్వాను గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్లలోకి తీసుకుని సర్వ్ చేయాలి. ఇష్టమైతే అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచుకుని తర్వాత కూడా సర్వ్ చేయొచ్చు.