ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? మామిడి పళ్ల జ్యూస్ పేరు తరచూ విని ఉంటారు కానీ ఈ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. ప్రస్తుతం మామిడి సీజన్ అయినందున మామిడి పళ్లను తీసుకుని రుచికరమైన ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు.
కావాల్సినవిః మామిడి రసం- 2 గ్లాసులు పాలు - 2 గ్లాసులు జెలెటిన్ ఫుడ్ పౌడర్- 2 టీస్పూన్ పంచదార- కొద్దిగా
తయారు చేసే విధానం: జెలటిన్ పౌడర్‌ను కొంత వేడినీళ్లలో గడ్డకట్టకుండా కలిపి, కరిగించాలి.
మామిడి పళ్ల రసంతో వేడి చేసిన పాలు, పంచదార, జెలటిన్ చేర్చి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో ఉంచండి.మిశ్రమం సగం వరకు గడ్డ కట్టిన వెంటనే బయటకు తీసి బాగా దంచి మళ్లీ ఫ్రీజర్‌లో ఉంచండి,
కొద్ది సేపు ఆగి తిరిగి బయటకు తీస్తే రుచికరమైన మేంగో ఐస్‌క్రీమ్ రెడీ.