కావలసిన పదార్థాలు : మారీ బిస్కట్లు - పది, పంచదార - రెండు టేబుల్ స్పూన్లు, కోకో పొడి - మూడు టీస్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, టూటీఫ్రూటీ - అరకప్పు, కన్డెన్స్డ్ మిల్క్ - అరకప్పు.
తయారు చేయు విధానం : ముందుగా వెన్నను ఉంచిన గిన్నపైన వేడి నీటి గిన్నెను పెట్టి కరిగించాలి. అది కరిగిన తర్వాత అందులో పంచదార, కోకోపొడులను వేసి కలపాలి. బిస్కట్లను సన్నగా పొడిలాగా చేసి ఇందులో వేసి తిప్పాలి. తర్వాత ఇందులో కాసిని కన్డెన్స్డ్ మిల్క్‌ను వేసి కలిపి చపాతీ పిండిలాగా కలపాలి.
చిన్న ఉండలుగా చేసి చపాతీ రాయిపైన వేసి ఒత్తి దానిని రోల్‌లాగా మడవాలి. తర్వాత వీటిని మీకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకుని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోండి. కావలసినప్పుడు తీసి సర్వ్ చేయండి.