మిల్క్ పౌడర్‌తో మైసూర్ పాక్

శుక్రవారం, 25 జులై 2008 (19:49 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
చక్కెర... 1 కిలో
నెయ్యి... 1 కిలో
అమూల్ మిల్క్‌పౌడర్... 250 గ్రా
మైదా... 250 గ్రా
యాలుకల పొడి... 1 టీ స్పూను
నీళ్లు... అర లీటరు

తయారీ విధానం :
అమూల్ మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్దని, మైదాని వరుసగా వేసి కలపాలి. వేరొక గిన్నెలో మిగిలిన నెయ్యి వేసి వేడి చేసి పంచదార, మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి ట్రేలో పోసుకుని ఆరు గంటల పాటు ఆరబెట్టి కావాల్సిన సైజులో ముక్కలు చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి