తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

ఠాగూర్

ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (15:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రికి బైకు గిఫ్టుగా ఇచ్చేందుకు స్వగ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, గచ్చిబౌలిలలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో యశస్విని అనే యువతి టెక్కీగా పనిచేస్తున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు అనే గ్రామంలో ఉండే తన తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును గిఫ్టుగా ఇచ్చి సర్‌ ప్రైజ్ చేయాలని భావించింది. ఇందులో హైదరాబాద్ నగరంలోని ఆ బైకును కొనుగోలు చేసింది. తనతో పాటు పని చేస్తున్న ఉద్యోగితో కలిసి స్వగ్రామానికి బైకుపై బయలుదేరింది. 
 
అయితే, వీరి బైకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద వెళుతుండగా బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యశస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామవాసిగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు