ట్రాన్స్​జెండర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడో తెలుసా? (video)

సెల్వి

గురువారం, 17 అక్టోబరు 2024 (16:29 IST)
Transgender marriage
ఓ ట్రాన్స్​జెండర్, యువకుడి ప్రేమ ఫలించింది. తన ప్రేమ కోసం ఆ యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో ట్రాన్స్​జెండర్​ను వివాహం చేసుకున్నాడు. ధారణంగా ట్రాన్స్​జెండర్​తో పెళ్లి అంటే ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు. 
 
కానీ ఈ అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రం కుమారుడి ఇష్టాన్ని గౌరవించి, అతడి మనసుకు నచ్చిన వ్యక్తి(ట్రాన్స్​జెండర్​)ని ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. ఈ పెళ్లికి జగిత్యాల జిల్లా వేడుకైంది. 
 
వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస మల్యాల, అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్​జెండర్​ కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. 
 
రెండేళ్ల పాటు ఈ జంట ప్రేమలో వుంది. శ్రీనివాస మల్యాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. సాధారణ వివాహం ఎలా జరుగుతుందో, వీరికీ అదే రీతిలో, అంతే ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపులో ట్రాన్స్​జెండర్లు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

ట్రాన్స్ జెండర్‍ ను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు...

కరుణాంజలి అనే ట్రాన్స్ జెండర్ ను ఇష్టపడిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ కి చెందిన కుమార్.

వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో బుధవారం పెళ్లి చేసుకున్న కరుణాంజలి, కుమార్.

వివాహానికి వచ్చి బారాత్ లో… pic.twitter.com/jTkSBPCU9g

— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు