అసలు విషయానికి వస్తే... కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో సూర్యదేవ్ అనే యువకుడు తను ఇద్దరమ్మాయిలను ప్రేమించినట్లు పెద్దలకు చెప్పాడు. ఐతే ఇద్దరినిచ్చి చేయడం సాధ్యం కాదని తొలుత కాదన్నప్పటికీ పట్టుబట్టి ఇద్దరినీ పెళ్లాడుతానన్నాడు. ఇంకోవైపు ఆ ఇద్దరు యువతులు కూడా సూర్యదేవ్ ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. దీనితో చేసేదేమీ లేక పెద్దలు ఇద్దరమ్మాయిలతో అతడి వివాహం జరిపించారు.
సూర్యదేవ్ తన వివాహ ఆహ్వాన పత్రిక సైతం పంచాడు. అందులో వారి పేర్లను ముద్రించాడు. సిడాం వారి పెళ్లిసందడి.. చిరంజీవి సుర్యదేవ్ వివాహము, చిలసౌ లాల్ దేవి, జలకర్ దేవిలతో మార్చి 27, 2025 అంటూ పేర్లను ముద్రించి పంపాడు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వాటిలో కొన్ని....