ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఠాగూర్

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.99కి విక్రయించే బ్రాండ్లు, బీరు మినహా మిగిలిన అన్ని రకాల మద్యం ధరలను కూటమి ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్చిన‌ను ప్రభుత్వం ఇటీవలే రూ.14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇపుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చినట్టయింది. దేశీయ తయారీ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ కేటగిరీ మద్యం ధరలపై అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించనున్నారు. ఈ మద్యం ధరల పెంపును మందుబాబుబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈ మద్యంధరలను పెంచారని వారు వాపోతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు