తెలంగాణలో రూ.71.73కోట్లకు చేరిన నగదు, బంగారం ఇంకా..?

సెల్వి

మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (11:03 IST)
తెలంగాణలో ఎన్నికల ముందు పట్టుబడిన నగదు, బంగారం, మద్యం, ఉచితాలు రూ.71.73 కోట్లకు చేరాయని ఎన్నికల అధికారులు తెలిపారు. గత నెలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా నగదు, విలువైన మెటల్, మద్యం, ఇతర వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి.
 
 
కిందటి వారంలో రూ.25.67 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, ఫ్రీబీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఇప్పటివరకు రూ.29.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి.
 
ఏప్రిల్ 7తో ముగిసిన అంతకుముందు వారంలో రూ.12.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు రూ.9.54 కోట్ల విలువైన 3.62 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
 
ఇందులో వారం రోజుల వ్యవధిలో రూ.6.2 కోట్ల విలువైన మద్యం పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.15.49 కోట్ల విలువైన డ్రగ్స్ అలాగే మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
 
ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఆభరణాల విలువ రూ.10.33 కోట్లు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, చీరలు వంటి వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.7.04 కోట్లు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు