నాట్స్ ఆధ్వర్యంలో భువనగిరిలో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

ఐవీఆర్

శుక్రవారం, 24 మే 2024 (16:12 IST)
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. 
 
మహిళలు స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో నాట్స్ ఈ కుట్టుమిషన్ల పంపిణీ చేపట్టినట్టు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి తెలిపారు. మహిళా సాధికారత కోసం అటు అమెరికాలో ఇటు రాష్ట్రాల్లో నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణతో పాటు అనేక స్వయం ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణకు నాట్స్ చేయూత అందిస్తుందని బాపు నూతి వివరించారు. మహిళలు కుట్టుమిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు