క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.... అమీర్‌‍పేట మెట్రో స్టేషన్‌లోని షాపులో కొనుగోలు.. వీడియో వైరల్!!

ఠాగూర్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (12:05 IST)
తియ్యని వేడుక చేసుకుందాం.. అంటూ టీవీలో ప్రకటనలు ఇచ్చే డైరీ మిల్క్ కంపెనీ ఉత్పత్తి చేసే క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు కనిపించింది. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మెట్రో రైల్వే స్టేషన్‌లోని ఓ షాపులో కొనుగోలు చేసిన చాక్లెట్‌లో ఈ పురుగు కనిపించింది. దీంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆ పురుగుతో పాటు చాక్లెట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి శుక్రవారం మెట్రోల్ ఇంటికి తిరిగి వెళుతూ పిల్లల కోసమని ఓ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓ రిటైల్ షాపులో క్యాడ్‌బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా, చాక్లెట్‌పై పురుగు కనిపించింది. అదీ కూడా కదులుతుండటంతో రాబిన్ ఆశ్చర్యపోయాడు. 
 
వెంటనే మొబైల్ ఫోనుతో వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గడువు తీరిపోయిన చాక్లెట్లు అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ట్వీట్‌కు నెటిజన్లతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, క్యాడ్‌బరీ డైరీ మిల్క్ కంపెనీ స్పందించింది. తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశాయి. 


 

Man Finds Worm 'Crawling' In Dairy Milk Chocolate, Cadbury Responds https://t.co/CpHZHoxCtJ pic.twitter.com/n3q0GVKv6m

— NDTV (@ndtv) February 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు