వామ్మో.. ఇదేం ట్రాఫిక్‌రా బాబోయ్... హైదరాబాద్ నగరంలో నరకం.. (వీడియో)

బుధవారం, 3 జనవరి 2024 (08:44 IST)
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య నిత్యం ఎక్కువైపోతుంది. దీంతో వాహనచోదకులు గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందిం. ముఖ్యంగా, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లే వారి పరిస్థితి మరింత క్లిష్టంగా తయారైంది. సరైన సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. 
 
మరోవైపు, హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రక్‌, లారీల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఈ సమ్మె నేపథ్యంలో పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో వాహనదారులు పెట్రోల్‌ బంకుల వద్ద క్యూ కట్టారు. బంకుల్లో మధ్యాహ్నం 2 వరకు పెట్రోల్‌, డీజిల్‌ అయిపోయిందని నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంకర్ల యజమానులు సమ్మెను విరమించారని చెప్పడంతో వాహనదారులు ఊరట చెందారు.
 
పాతబస్తీలోని బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలోని పెట్రోల్‌ బంక్‌లు ఎదుట వాహనదారులు బారులు తీరారు. బంక్‌ల నిర్వాహకులు స్టాక్‌ ఉన్నంత వరకు విక్రయించి అనంతరం బారీకేడ్లతో మూసివేశారు. బండ్లగూడలో కొన్నిపెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు ఒక్కో వాహనదారుడికి రూ.300 మాత్రమే పెట్రోల్‌ పోశారు. ఏది ఏమైన కొత్త సంవత్సరం రెండో రోజునే హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ నరకం అనుభవించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు