warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

ఐవీఆర్

శనివారం, 19 ఏప్రియల్ 2025 (16:30 IST)
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. అర్చన (Archana) అనే మహిళా కానిస్టేబుల్ (warangal police) చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర మానసిక వేదనలో వున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
వరంగల్ జిల్లాలోని కాజీపేట దర్గాకు చెందిన అర్చన 2022లో వివాహం చేసుకున్నది. ఐతే కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనితో తమిద్దరికీ పొసగదని భావించి విడాకులు తీసుకున్నారు. ఇక అప్పట్నుంచి అర్చనకు మరో వివాహం చేయాలని ఆమె పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ సంబంధం కుదరడంలేదు. దీనితో తీవ్ర నిరాశ చెందిన అర్చన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు